ఆంధ్రప్రదేశ్ లో 900 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. పది రోజుల్లోనే నోటిఫికేషన్.ఫిబ్రవరి ప్రిలిమ్స్ నిర్వహించే యోచన.ఆగస్టులోనే 508 పోస్టుల భర్తికి అనుమతి. తాజాగా మారి 212 పోస్టులకు ఓకే.గత నోటిఫికేషన్ లోవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 203 కూడా భర్తీ.మొత్తం 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం. ఏపీపీఎస్సీకి ఆర్థిక శాఖ అనుమతి.

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమెరకు APPSC కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పటికే ఏడాది ఆగస్టు 25వ తేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్ట్లు, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తుంది. తద్వారా గ్రూప్-2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని భావిస్తుంది.


You may also like...