ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 1896 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో 1800 పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన ప్రకటన.రాష్ట్రంలోని పశు పోషకులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటివద్దనే పశువైద్యం అందించాలని లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 పశుసంవర్ధక సహాయక పోస్టుల నియామకాన్ని చేపడుతున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు తొలి విడుదల 3033, రెండవ విడతలో 1619 పశుసంవర్ధక సహాయకులను నియమించమని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని,త్వరలో చేపట్టిన ఉద్యోగులభర్తీని కూడా పూర్తి పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు.నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


You may also like...