AP గ్రామ వార్డు సచివాలయం 1800 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, రైతు భరోసా కేంద్రాలు పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ 1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలో ఖాళీగా ఉన్న 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 1896 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆ శాఖ స్పెషల్ ఉత్తర్వులు జారీ చేశారు.సచివాలయాలు అనుబంధంగా గ్రామస్థాయిలో 10,078 వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తొలిత స్థానికంగా ఉండే పశుసంపాద ఆధారంగా 9844 వి ఏ హెచ్ ఏ లు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు విడతల్లో 4643 రైతు భరోసా కేంద్రాల్లో VAHA నియమించారు. కాగా రేషనల్లైజేషన్ ద్వారా ఒకే గ్రామంలో రెండు, మూడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నచోట గ్రామాన్ని యూనిట్ గా VAHA లను నియమించి, అదనంగా ఉన్న VAHA లను రైతు భరోసా కేంద్రాలకు సర్దుబాటు చేశారు. మిగిలిన 1896 రైతు భరోసా కేంద్రాల్లో పరిధిలో ఖాళీగా ఉన్న విహెచ్ఎ లను నియమించాలని గుర్తించారు. ఈ పోస్టుల భర్తీ కోసం నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


You may also like...