రాష్ట్రం లో విద్య శాఖలో 5500 ఉద్యోగాలు, జిల్లాలో భారీగా ఖాళీలు, సూపర్ ఛాన్స్

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


»»పోస్టుల ఖాళీలు :
5,500
»»ఉద్యోగ వివరాలు :
టీచర్లు
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది టీచర్లను ఆయా స్కూళ్లలో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
సెప్టెంబరు 15వ తేదీన TS TET 2023 నిర్వహిస్తున్నందున.. ఆ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు కనీసం 6-8 నెలల సమయం పడుతుంది. అంటే సెప్టెంబరు నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేసినా,కొత్త ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరం లోనే విధుల్లోకి వచ్చే అవకాశం ఉంది.



You may also like...