AP గ్రామ వార్డు సచివాలయం 14000 వేల ఉద్యోగ ఖాళీలు, పోస్టుల ప్రకారం ఖాళీల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కొలువులు, అతి త్వరలో AP గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ..
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు ఏర్పాడ్డాయి. తాజాగా గుర్తించిన ప్రకారం మొత్తం 13,995 ఖాళీలున్నట్లు తేలింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా సర్కారు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల్లో అధికంగా పశుసంవర్థక శాఖలోనే కనిపిస్తున్నాయి.


»»»పోస్టుల ఖాళీలు :
»» 4,765 పశుసంవర్థక సహాయకుల ఖాళీలు
» హార్టికల్చర్ విభాగంలో 1496 అసిస్టెంట్ పోస్టులు,
» మహిళా పోలీస్‌ పోస్టులు 1092,

»గ్రామ సర్వేయర్‌ సహాయకుల పోస్టులు 1027 ఖాళీగా ఉన్నాయిYou may also like...