భారీ నోటిఫికేషన్, ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) లో 577 అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) లో అకౌంట్ ఆఫీసర్ సహా పలు ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈవో), అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏవో) తో పాటు అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ (APFC) ఉద్యోగాలను యూపీఎస్పీ భర్తీ చేయనుంది.

◆పోస్టుల ఖాళీలు:

577

◆నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు..


మొత్తం ఉద్యోగాలు:

577.

1.ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈవో)/అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏవో) ఉద్యోగాలు 418
2.అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ పోస్టులు 159 ఉన్నాయి.
దరఖాస్తులు ప్రారంభం –

◆ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రారంభం కానుంది. మార్చి 17న సాయంత్రం 6గంటలతో ముగియనుంది.

◆అర్హతలు:

పూర్తి సమాచారం కోసం OFFICIAL NOTIFICATION విడుదల అయిన తర్వాత చూడగలరు.

◆వయస్సు:

ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు.
ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వరకు వయో పరిమితి విధించారు.

◆ఎంపిక ప్రక్రియ:


1.రాతపరీక్ష
2.ఇంటర్వ్యూ
3.డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌,

4.మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఉంటుంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...