ఆంధ్రప్రదేశ్ లో 115 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీల వివరాలు, అర్హత 7th & 10th క్లాస్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.

◆పోస్టుల ఖాళీలు:

115

◆ఉద్యోగ వివరాలు:

1.అంగన్‌వాడీ వర్కర్
2.అంగన్‌వాడీ హెల్పర్
3.మినీ అంగన్‌వాడీ వర్కర్

◆అర్హతలు:

● అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
● అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఏడో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.

◆వయస్సు:

జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

◆ముఖ్యమైన తేదీలు:

ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌లో అందజేయాలి. దరఖాస్తులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది.

◆సెలెక్షన్ విధానం:

పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

◆ఇంటర్వ్యూ వివరాలు:

ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది.

◆జీతం:

ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ.11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...