సంక్షేమ పాఠశాలలో 11000 వేల కి పైగా టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు అన్ని జిల్లాల వారికి

సంక్షేమ పాఠశాలలో 11 వేలకు పైగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అతి త్వరలో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. వాటికి సంబంధించిన వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

◆ పోస్టుల ఖాళీలు

11,105

తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 11,105 టీచర్‌ పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలు పెట్టేసింది. దీంతో మిగతా పోస్టులన్నింటికీ కలిపి వీలైనంత త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ వారంలోనే దాదాపు 6 వేలకు పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 45 రోజుల వరకు కొనసాగుతుంది. అనంతరం తగిన సమయం ఇచ్చి రాత పరీక్షలు పూర్తిచేయాలని గురుకుల నియామక బోర్డు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలు పూర్తిచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రకటన అనంతరం పరీక్షలకు సన్నద్ధమవడానికి కనీసం మూడు నెలల సమయం ఉండేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా బోర్డు షెడ్యూల్‌ను రూపొందిస్తోంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...