నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో పౌరసంబంధాల శాఖలో విద్యా శాఖలో 2000 పైగా భారీగా ఉద్యోగాలు

గురుకుల విద్యాసంస్థలో మరిన్ని పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిలు జారీ చేసింది ఇప్పటికే 9096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలివ్వగా వీటి భర్తీకి సంబంధించిన ఏర్పాట్లను గురుకుల విద్యాసంస్థలను నియమకాల బోర్డు పూర్తి చేసింది.

తాజాగా మరో 2,225 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇందులో బీసీ గురుకుల పాఠశాలకు సంబంధించి 2132 పోస్టులు గాను ఐదు వేరు వేరు ఉత్తర్వులు జారీ చేయగా, జనరల్ గురుకుల పరిధిలో 93 ఉద్యోగాలకి మరో జీవో జారీ చేశారు. అలాగే సమాచార, పౌర సంబంధాల శాఖ పరిధిలో 166 పోస్టుల భర్తీకి మరో జీవోను ఆర్థిక శాఖ జారీ చేసింది. గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీ బాధ్యతలు టిఆర్ఈఐఆర్ బీ కి,జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని టిఎస్పిఎస్సి కి, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీని టి ఎం హెచ్ ఎస్ ఆర్ బి అప్పగించింది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...