255 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్,ఇంటర్ అర్హత, అన్ని జిల్లాల వారికి ఛాన్స్

255 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హతలు అప్లికేషన్ విధానము, వయస్సు, పరీక్ష విధానం, క్రింద తెలుపబడిన పేజీలో డౌన్లోడ్ ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో.. 255 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచి) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

◆పోస్టుల ఖాళీలు:

255

◆అర్హతలు:

నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.

◆వయస్సు:

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబర్‌ 1, 2001 నుంచి ఆగస్టు 31, 2005 తేదీల మధ్య జన్మించి ఉండాలి.

◆ ముఖ్యమైన తేదీలు

ఈ అర్హతలున్న వారు ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

◆ పరీక్ష విధానం:

స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

◆ జీతం:

ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

___________________________________________________

You may also like...