ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్,14523 ఉద్యోగ ఖాళీలు,పోస్టుల ప్రకారం ఖాళీల వివరాలు

గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 20 కేటగిరిలో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తుంది.

◆ ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్


◆ దాదాపుగా 14523 ఖాళీలు

◆మూడు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం

గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 20 కేటగిరిలో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తుంది.

◆పోస్టుల ఖాళీలు:

14523

◆ఉద్యోగ వివరాలు:

గ్రామ వార్డు సచివాలయంలో మిగిలిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్ జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఏప్రిల్ లోపు రాత పరీక్షలు పూర్తి చేసే అవకాశం, ఈ ఏడాది ఏప్రిల్ లోపే మూడో విడత నోటిఫికేషన్ కి సంబంధించిన రాత పరీక్షలు కూడా నిర్వహించాలని యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాత పరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ గత సోమవారం పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది .అలాగే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరాలను కూడా ఆ లేఖల పేర్కొంది. ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ సహ మొత్తం 20 కేటగిరి లో ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్, వ్యవసాయ, పశుసంవర్ధక, సాంఘిక సంక్షేమ, ఉద్యానవన ,సెరికల్చర్, ఫిషరీస్ వైద్య, ఆరోగ్య, హోం శాఖల పర్యవేక్షణలో ఆయా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కూడా క్యాటగిరిల వారిగా ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించేందుకు ఆయా శాఖల అధికారుల నుంచి సమాచారం వేరుగా తెప్పించుకుంటుంది. మొత్తంగా మూడు నెలల వ్యవధిలోని ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...