AP ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో రికార్డు అసిస్టెంట్ గ్రంథ పాలకుల పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఈ క్రింది ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన స్థానిక (ఉమ్మడి కృష్ణ జిల్లా పరిధిలో చదువుకున్నల అభ్యర్థుల నుంచి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా గాని 18-1-2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

దరఖాస్తులను అన్ని వివరాలతో కూడిన బయోడేటా తో పంపవలెను. ఈ పోస్టుకు ఏ క్యాటగిరికి దరఖాస్తు చేయుచున్నారో తప్పక దరఖాస్తు పై నమోదు చేయవలెను. అలాగే దరఖాస్తు పై తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ను నమోదు చేయవలెను.

◆పోస్టుల ఖాళీలు:

05

◆పోస్టుల వివరాలు:

1.గ్రంథ పాలకులు
2.రికార్డ్ అసిస్టెంట్

◆వయస్సు:

1-07- 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు ఐదు సంవత్సరాలు & వికలాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాల కొరకు కార్యాలయ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కార్యాలయలో సంప్రదించగలరు.

◆ దరఖాస్తు పంపించవలసిన చిరునామా:

కార్యదర్శి ,
కృష్ణాజిల్లా,
గ్రంథాలయ సంస్థ,
పోర్టు రోడ్డు, మచిలీపట్నం
పిన్ కోడ్ 521001
కృష్ణాజిల్లా.


You may also like...