నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో 163 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, జిల్లాల ప్రకారం ఖాళీలు

రాష్ట్రంలో 163 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసు కింద వివిధ జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 163 ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషలో నైపుణ్యం, సంబంధిత స్కిల్స్‌ ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

◆ ముఖ్యమైన తేదీలు:

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది.

◆ సెలెక్షన్ విధానం:

ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు.

◆ జీతం:

అర్హత సాధించిన వారికి నెలకు రూ.22,900ల నుంచి రూ.69,150ల వరకు జీతంగా చెల్లిస్తారు.

◆ అర్హతలు:

◆పోస్టుల ఖాళీలు:

◆భద్రాద్రి కొత్తగూడెంలో ఖాళీలు: 4
◆సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్ లో ఖాళీలు: 15
◆హైదరాబాద్ లో ఖాళీలు: 2
◆హనుమకొండలో ఖాళీలు: 5
◆జోగులాంబ గద్వాలలో ఖాళీలు: 5
◆జగిత్యాలలో ఖాళీలు: 5
◆జనగామలో ఖాళీలు: 4
◆జయశంకర్ భూపాలపల్లిలో ఖాళీలు: 3
◆ ఆసిఫాబాద్ లో ఖాళీలు: 3

◆ మహబూబాబాద్ లో ఖాళీలు: 1
◆మహబూబ్ నగర్లో ఖాళీలు: 8
◆మంచిర్యాలలో ఖాళీలు: 2
◆మెదక్ లో ఖాళీలు: 1
◆మేడ్చల్-మల్కాజిగిరిలో ఖాళీలు: 18
◆మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్,

◆హైదరాబాద్ లో ఖాళీలు: 4
◆ములుగులో ఖాళీలు: 3
◆నాగర్ కర్నూలులో ఖాళీలు: 7
◆నల్గొండలో ఖాళీలు: 3
◆నారాయణపేటలో ఖాళీలు: 4
◆నిజామాబాద్లో ఖాళీలు: 2
◆పెద్దపల్లిలో ఖాళీలు: 2
◆రాజన్న సిరిసిల్లలో ఖాళీలు: 3
◆రంగారెడ్డిలో ఖాళీలు: 27
◆సిద్దిపేటలో ఖాళీలు: 5
◆సూర్యాపేటలో ఖాళీలు:7
◆వికారాబాద్ లో ఖాళీలు: 6
◆వనపర్తిలో ఖాళీలు: 6
◆వరంగల్లో ఖాళీలు: 5
◆యాదాద్రి భువనగిరిలో ఖాళీలు: 3

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం ◆

You may also like...