విద్య శాఖలో 11,000 వేల కి పైగా టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు

రాష్ట్రప్రభుత్వం 11,000 వేల కి పైగా ఉద్యోగాల తో అతి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు నోటిఫికేషన్ విడుదల అవ్వగానే వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

◆తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో దాదాపు 11,000లకుపైగా అధ్యాపకుల పోస్టులకు నియామక ప్రకటన జారీ చేయాలని గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

◆ఈ ఏడాదికి కొత్తగా మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తి చేసింది.

◆దీనికి సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రోస్టర్‌, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది. జనవరి రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది.

రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇప్పటికే 9,096 పోస్టులను రాష్ట్ర సర్కార్‌ మంజూరు చేసింది. అదనంగా మంజూరైన పోస్టులతో కలిపి ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రకటన అనంతరం పరీక్షలకు సన్నద్ధమవడానికి కనీసం మూడు నెలల సమయం ఉండేలా షెడ్యూల్ తయారు చేయనున్నారు. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది.

◆ పోస్టుల ఖాళీల వివరాలు:

కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులతో కలిపి ఈ ఒక్క శాఖలోనే అత్యధికంగా 6,461 పోస్టులు ఉన్నాయి.

◆బీసీ గురుకులాల్లో 6,461పోస్టులు
◆ఎస్సీ సంక్షేమ శాఖలో 2,267

◆గిరిజన సంక్షేమశాఖలో 1,514

◆మైనార్టీ సంక్షేమశాఖలో 1,445 పోస్టులు భర్తీ కానున్నాయి.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...