ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ పోస్టుల ఖాళీల వివరాలు 7384, అన్ని జిల్లాల వారికి అవకాశం

ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ పోస్టుల ఖాళీల వివరాలు 7384, అన్ని జిల్లాల వారికి అవకాశం.

జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు త్వరలో విడుదల అయ్యే నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

◆ఆర్బికేలో 7384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
◆అత్యధికంగా 5188 పశుసంవర్ధక సహాయక పోస్టులు
◆1644 ఉద్యాన సహాయకులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏర్పాట్లు

◆కొత్త పోస్టుల భర్తీతో 21,731 మందికి చేరనున్న ఆర్బికే సిబ్బంది.

ఆర్బికేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండలాల్లో 10778 ఆర్పీకెలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల భారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

ఈ మేరకు ఆర్బికేల ఏర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సంఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అత్యధికంగా 5188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1644 ఉద్యాన, 467 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకుల పోస్టు ఖాళీగా ఉన్నట్టు తెలపడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటికి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పోస్టులు అన్ని కూడా భర్తీ చేస్తే ఆర్బికే లో పనిచేసే వారి సంఖ్య 21,731 కి చేరుతుంది. ఆర్బికేలో తో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సంక్రాంతి లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. ప్రతి ఆర్బికేలో స్థానికంగా ఉండే పాడి పంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి అనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టామని తెలపడం జరిగింది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...