రాష్ట్రంలో విద్యుత్ శాఖలో 157 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి అవకాశం

రాష్ట్రంలో 157 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ TSNPDCL జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలోని ఎకౌంట్స్ సహా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 157 పోస్టులను భర్తీ చేయడానికి అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు అన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్ పీడీసీఎల్ కార్యాలయంలో అందజేయాలని సూచించింది.

◆పోస్టుల ఖాళీలు:

1.హనుమకొండ ౼11
2.వరంగల్ ౼10
3.జనగాం -08
4.మహబూబాబాద్ -08
5.ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి -07
6.కరీంనగర్ -13

7.పెద్దపల్లి -10
8.జగిత్యాల -09
9.ఖమ్మం -15
10.బద్రాద్రి కొత్తగూడెం 10 11.నిజామాబాద్-16
12.కామారెడ్డి- 11
13.ఆదిలాబాద్ (07)
14.నిర్మల్ (07)
15.మంచిర్యాల (08)

16.కుమురంభీం-ఆసిఫాబాద్ (06)

◆విద్య అర్హతలు:

అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ/ ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభం ఉండాలి.

◆అప్లికేషన్ విధానం:

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

◆అప్లికేషన్ పంపించే చిరునామా:

దరఖాస్తులను ది ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(ఆడిట్‌) టీఎస్‌ఎన్ పీడీసీఎల్‌, కార్పొరేట్ ఆఫీస్‌, 3వ అంతస్తు, విద్యుత్‌ భవన్‌, నక్కలగుట్ట, హన్మకొండ, 506001 అడ్రస్‌లో అందించాలి.
దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ 23-01-2023.


You may also like...