గుడ్ న్యూస్ 4660 ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ,అన్ని జిల్లాల వారికి అవకాశం

◆4661 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు
◆31 లోపు వెలువడనున్న నియామక ప్రకటన
◆ పరీక్షకు సన్నద్ధం అవ్వడానికి రెండు నెలల గడువు

సివిల్ అసిస్టెంట్ సర్జన్ ల నియామక ప్రక్రియ విజయవంతగా ముగించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యచరణ పై దృష్టి పెట్టించింది. 4661 స్టాఫ్ నర్స్ నియామక ప్రక్రియను వెలువరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 లోపే ఈ ప్రకటన కూడా వెలువరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ద్వారా ఇప్పటివరకు వైద్యుల నియామక ప్రక్రియను మాత్రమే నిర్వహించారు. అయితే నర్స్ పోస్టుల భర్తీకి మాత్రం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు.

ఈ నెలాఖరులోగా నియమక ప్రకటన వెలువరించి పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం ఆవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇస్తారు. బహుళ ఐచ్చిక సమాధానాలు రూపంలో ప్రశ్నాపత్రం రూపకల్పనను ప్రత్యేకంగా నిపుల కమిటీ నియమిస్తారు.

◆ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తే అధిక వెయిటేజీ ..

ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద పొరుగు సేవల ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న, గతంలో పనిచేసిన వారికి అదనపు మార్కులు ఉంటాయి. స్టాఫ్ నర్స్ అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి పనిచేసిన వారికి వెయిటేజ్ గా కేటాయిస్తారు.

◆27 లోగా సివిల్ అసిస్టెంట్ల కు పోస్టింగ్లు

తాజాగా నియమితులైన 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు డిసెంబర్ 27 లోగా పోస్టింగ్ ఇవ్వడానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734, వైద్య పరిస్థితి విధాన పరిషత్ లో 29, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. వీరికి విభాగల వారిగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పోస్టులకు రోజుకు 250 మంది చొప్పున మూడు రోజులపాటు కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు .అయితే విధాన పరిషత్ పరిధిలో ఒక రోజులో కౌన్సిలింగ్ పూర్తి చేస్తారు. పోస్టర్ ఖాళీల సమాచారం ముందస్తుగానే అభ్యర్థులకు వెల్లడించి అందుబాటులో ఉన్న ఖాళీలలో పోస్టింగు ఇస్తారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

You may also like...