ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, AP అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్,AP చేనేత & జౌళి శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్లు◆

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ నెల్లూరు నందు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ & క్లాస్ రూమ్ అటెండర్ మొదలగు ఉద్యోగాలకు రీ-నాటిఫికేషన్ నందు ఔట్సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సినదిగా కోరుచున్నారు. కావున అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్స్ తేదీ 19 12-2022 నుండి తేదీ 28-12- 2022 లోపు ప్రిన్సిపల్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరు వారికి ఇవ్వాల్సినదిగా కోరడమైనది.

◆పోస్టుల ఖాళీలు:

1.జూనియర్ అసిస్టెంట్
2.క్లాస్ రూమ్ అటెండర్
◆ఉద్యోగాలు:

1.జూనియర్ అసిస్టెంట్
2.క్లాస్ రూమ్ అటెండర్

◆ అర్హత:

డిగ్రీ ,7th క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి.

18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

◆ జీతం:

నెలకు 18,500/-

◆సెలెక్షన్ విధానం

ఎంపిక ప్రక్రియ అకాడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా.

◆ దరఖాస్తు విధానం :

◆ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చివరి తేదీ 28- 12- 2022


◆అంగన్వాడి కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొని వారు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను.
◆ స్థానికంగా నివాసం కలిగి ఉండవలెను.
◆ 1-7-2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
◆ ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతంలో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేనియెడల 18 సంవత్సరం నిండిన వారు కూడా అర్హులు.

◆జీతం వివరాలు:

◆ అంగన్వాడీ కార్యకర్తకు గౌరవేతనం 11,500
◆మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం 7000
◆ అంగన్వాడి సహాయకుల గౌరవ వేతనం 7000 చెల్లించబడును.
● రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయంలో నోటీసు బోర్డు నందు ఉంచబడును.

◆అప్లికేషన్ విధానం:

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల, నివాసం, పుట్టిన తేదీ 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ సంబంధిత పత్రములను గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ పత్రములను జతపరచవలెను.


◆AP చేనేత జౌళి శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం◆

జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధి కల్పన కార్యక్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు.

◆ పోస్టుల ఖాళీల వివరాలు:

1.3 టెక్స్టైల్ డిజైనర్

3 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

◆విద్య అర్హతలు:

1.క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లమా పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.

2.టెక్స్టైల్స్ డిజైనర్ పోస్ట్ కి టెక్స్టైల్స్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణులు అవడంతో పాటు చేనేత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఎక్స్పీరియన్స్, వయస్సు స్థానిక నివాసం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామని వివరించారు. మూడేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపాదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత సమయంలోపల పంపించవలెను.

◆ముఖ్యమైన తేదీలు

డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ క్రింద తెలిపిన చిరునామాకు పంపించవలెను.

◆ పంపించవలసిన చిరునామా:

కమిషనర్
చేనేత జౌళి శాఖ.
4వ అంతస్తు
ఐ.హెచ్.సి కార్పొరేట్ బిల్డింగ్,ఆటో నగర్
మంగళగిరి
గుంటూరు జిల్లా
పిన్ కోడ్ 522503



తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. 4,661 స్టాఫ్‌ నర్సుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్‌ డిసెంబ‌రు 31లోపే ఆ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక మొత్తం 4661 పోస్టుల్లో ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి పరిధిలో 81, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 757, వైద్య విద్య సంచాలకుల పరిధిలో 3823 పోస్టులున్నాయి.

______________________________________________

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

You may also like...