రోడ్లు,భవనాలు,న్యాయ శాఖలో భారీగా 11,000 వేల ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో 4,600లకుపైగా ఉద్యోగాలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెల్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా పోస్టులకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో కోర్టుల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా అనుమతి లభించినట్లైంది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది.


ఇప్పటికే తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 కొత్త నియామకాలకు రాష్ట్ర క్యాబినెట్‌ అనుమతి తెల్పిన విషయం తెలిసిందే. ఈ రోజు మరో 4,200ల పోస్టులకు అనుమతి లభించడంతో.. రానున్న రోజుల్లో మొత్తం 11 వేలకు పైగా ఉద్యోగాలను నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.

ఇప్పటికే పోలీస్ శాఖలో దాదాపు 16 వేల పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం… ఇటు గ్రూప్ 4, గ్రూప్ 2, అలాగే రెవెన్యూ అటు వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా… తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లు పేర్కొన్నారు.

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. 1392 లక్షల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఈ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గత నెలలో మరియు ఈ నెలలో విడుదలైన నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన వివరాలు ఈ క్రింద ఇవ్వబడిన పేజీలో ఉన్నవి

You may also like...