రాష్ట్ర సంక్షేమ గురుకుల లో భారీగా 2500 కొత్తగా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 నూతన ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర క్యాబినెట్‌ శనివారం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్‌ పాఠశాలలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ విభాగాల్లో అవసరమైన మేరకు నూతన నియామకాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

◆బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భర్తీ
సైబర్‌ సేఫ్టీలో 3,966.. ఆర్‌అండ్‌బీలో 472◆

ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.

◆పోస్టుల ఖాళీలు-3966

పోలీస్‌శాఖను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించింది. వివిధ విభాగాల్లో 3,966 పోస్టులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది.

ఆర్‌అండ్‌బీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఆ శాఖలో 472 పోస్టుల భర్తీతోపాటు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది.

You may also like...