AP చేనేత జౌళి శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం,జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు

◆AP చేనేత జౌళి శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం◆

జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధి కల్పన కార్యక్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు.

◆ పోస్టుల ఖాళీల వివరాలు:

1.3 టెక్స్టైల్ డిజైనర్

  1. 3 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

◆విద్య అర్హతలు:

1.క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లమా పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.

2.టెక్స్టైల్స్ డిజైనర్ పోస్ట్ కి టెక్స్టైల్స్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణులు అవడంతో పాటు చేనేత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఎక్స్పీరియన్స్, వయస్సు స్థానిక నివాసం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తామని వివరించారు. మూడేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపాదికన పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత సమయంలోపల పంపించవలెను.

◆ముఖ్యమైన తేదీలు

డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ క్రింద తెలిపిన చిరునామాకు పంపించవలెను.

◆ పంపించవలసిన చిరునామా:

కమిషనర్
చేనేత జౌళి శాఖ.
4వ అంతస్తు
ఐ.హెచ్.సి కార్పొరేట్ బిల్డింగ్,ఆటో నగర్
మంగళగిరి
గుంటూరు జిల్లా
పిన్ కోడ్ 522503

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

◆ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గత నెల మరియు ఈ నెలలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు క్రింద పేజీలో ఇవ్వడం జరిగింది◆

You may also like...