రోడ్లు, భవనాల శాఖలో 472 ఉద్యోగ ఖాళీలు :పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీ◆

◆ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472◆

రాష్ట్రంలో మరోసారి కొలువుల జాతరకు . రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం లభించింది. పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ సేఫ్టీ బ్యూరోలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాదు, డ్రగ్స్ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

పోలీస్ శాఖలో 3,996 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఆర్ అండ్ బీ విభాగంలో 472 అదనపు పోస్టులను మంజూరు చేసింది. నూతనంగా ప్రారంభమైన కాలేజీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని ఆదేశించింది.

◆రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగ ఖాళీలు :

రోడ్లు, భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో కొత్తగా

పోస్టుల ఖాళీల వివరాలు :


◆3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు,
◆12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు,
◆13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు
◆102 డి.ఈ.ఈ పోస్టులు,
◆163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు,
◆28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్

పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

రోడ్లు, భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా R&B శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.

You may also like...