రాష్ట్ర వెల్ఫేర్ (సంక్షేమ శాఖ) డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర వెల్ఫేర్ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఆప్షన్లో క్రింద ఇవ్వబడినది పూర్తి వివరాలు చూసి ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోగలరు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ లోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొటెక్షన్ ఆఫీసర్(ఇనిస్టిట్యూట్ కేర్, నాన్ ఇనిస్టిట్యూట్ కేర్), లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, ఔట్ రీచ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డిసెంబర్ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను నోటిపికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ప్రొటెక్షన్ ఆఫీసర్(ఇనిస్టిట్యూట్ కేర్) పోస్టులకు నెలకు రూ. 27,300 జీతంగా చెల్లిస్తారు. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇనిస్టిట్యూట్ కేర్) పోస్టులకు నెలకు రూ. 27,300 జీతం.

లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 27,300 జీతంగా చెల్లిస్తారు. సోషల్ వర్కర్ పోస్టులకు నెలకు రూ. 18,200 జీతం. ఔట్ రీచ్ వర్కర్ పోస్టులకు నెలకు రూ. 10,400 జీతంగా చెల్లిస్తారు.

జిల్లా సంక్షేమాధికారి, WCD & SC, హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణ, 1వ అంతస్తు, పాత కలెక్టరేట్‌ బిల్డింగ్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్, అబిడ్స్‌, హైదరాబాద్‌-500001.

You may also like...