పంచాయతీ శాఖలో,రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ & ఇతర పోస్టులు 9000, పాలిటెక్నిక్ కళాశాలలో 247 & కుటుంబ సంక్షేమ శాఖలో 1100 పోస్టులు

పంచాయతీ శాఖలో,రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ & ఇతర పోస్టులు 9000, పాలిటెక్నిక్ కళాశాలలో 247 కుటుంబ సంక్షేమ శాఖలో 1100 పోస్టులు

◆జూనియర్ అసిస్టెంట్& ఇతర పోస్టులు: 9000

◆పాలిటెక్నిక్ కళాశాలలో 247

◆కుటుంబ సంక్షేమ శాఖలో 1100 పోస్టులు

ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవల 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మరో 16,940 పోస్టుల భర్తీకి అనుమతినివ్వనుంది. ఉద్యోగ నియామకాల అంశంపై బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని తెలిపారు.

డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌ పోస్టుల్లో ఇప్పటివరకు వివిధ శాఖల్లోని పలు కేటగిరీలకు చెందిన 60,929 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేశామని స్ ఈ సందర్భంగా వివరించారు. మరో 16,940 పోస్టులకు అనుమతులు ఇవ్వడానికి అంతా సిద్ధం చేశామని, ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని తెలిపారు.

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ప్రిపేర‌వుతున్న అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో శుభవార్త వినిపించింది. మొన్న గ్రూప్-4 నోటిఫికేష‌న్(9,168 ఉద్యోగాలు), నిన్న మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌గా, తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది

రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చ‌రర్ల పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 19 స‌బ్జెక్టుల్లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నెల 14 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

◆◆ఈ నెలలో విడుదల అయిన నోటిఫికేషన్ వివరాలు ఈ క్రింద ఉన్న పేజీ లో ఉన్నవి◆◆

You may also like...