నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్-3 & గ్రూప్-4 ఉద్యోగాలు,పోస్టుల వివరాలు

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఖాళీలు మరింత పెరుగనున్నాయి.ఇప్పటికే ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకే తీరుగా ఉండటంతో ఈ మార్పులు చేసింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.

గ్రూప్-3లో చేర్చిన పోస్టులు

ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ విభాగంలోని అకౌంటెంట్ పోస్టు, వివిధ విభాగాల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్/ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ పోస్టులను గ్రూప్ 3 పరిధిలో చేర్చారు.

గ్రూప్-4లో చేర్చిన పోస్టులు

జిల్లా విభాగాల పరిధిలోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, సూపర్వైజర్ (మేల్), స్టోర్ కీపర్, గ్రూప్ 4 సర్వీసుల పరిధిలోకి చేర్చారు.

దీంతో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది.

You may also like...