AP గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్, AP బ్యాక్ లాగ్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

AP బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా పలు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 49 బ్యాక్‌లాగ్ పోస్టులను వివిధ శాఖలలో భర్తీచేయనున్నారు. పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడంతో పాటు 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్ఏ, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబరు 22 నుంచి డిసెంబరు 06 వరకు కొనసాగుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తులతో పాటు సంబందిత నిర్ణిత ధృవ పత్రములను డిసెంబరు 06 సా.5లోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవలెను.

పోస్టులు వివరాలు..
1.జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 6
2.జూనియర్ ఆడిటర్ పోస్టులు: 1
3.టైపిస్ట్ పోస్టులు: 2
4.టైపిస్ట్/ స్టెనో పోస్టులు: 1
5.జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 1
6.వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు: 1
7.ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 1
8.ఎంపీహెచ్‌ఏ పోస్టులు: 1
9.హెల్త్ అసిస్టెంట్ పోస్టులు: 1
10.మెటర్నిటీ అసిస్టెంట్ పోస్టులు: 1
11.బోర్‌వెల్ ఆపరేటర్ పోస్టులు: 1
12.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టులు: 9
13.షరాఫ్ పోస్టులు: 1
14.ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 7
15.వాచ్‌మెన్ కమ్ హెల్పర్ పోస్టులు: 1
16.వాచ్‌మెన్ పోస్టులు: 3
17.నైట్ వాచ్‌మెన్ పోస్టులు: 2
18.బంగ్లా వాచర్ పోస్టులు: 1
19.కుక్ పోస్టులు: 1
20.కమాటి పోస్టులు: 2
21.స్కావెంజర్ పోస్టులు: 1
22.స్వీపర్ పోస్టులు: 1
23.పీహెచ్‌ వర్కర్ పోస్టులు: 1
24.యుటెన్సిల్ క్లీనర్ పోస్టులు: 1
25.బేరర్ పోస్టులు:1

You may also like...