నిరుద్యోగులకు శుభవార్త 259 పోస్టులకి భారీ నోటిఫికేషన్ ,కరెంట్ ఆఫీస్ లో 800 ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త 259 పోస్టులకి భారీ నోటిఫికేషన్.పూర్తి వివరాలు చూడండి.కరెంట్ ఆఫీస్ లో 800 ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) 259 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితర పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా/ ఐటీఐ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్‌ 26, 2022
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 17, 2022

PGCIL: బీటెక్‌, డిప్లొమా వాళ్లకు ప్రభుత్వ సంస్థలో 800 ఉద్యోగాలు.. ఫీల్డ్ ఇంజినీర్, సూపర్‌వైజర్ జాబ్స్‌
PGCIL Recruitment 2022 : న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL).. ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 800 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్‌ 21 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి.

You may also like...