AP నిరుద్యోగులకు శుభవార్త,6500 కి పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్,13 జిల్లాలో భారీగా ఖాళీలు

ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6,511 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది. ఇటీవల దీనికి సంబంధించి డీజీపీ గారు శ్రీకాకుళంలో పర్యటనలో భాగంగా.. ఏపీ పోలీసు శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటన చేసిన విష‌యం తెల్సిందే.

అత్యధికంగా సివిల్‌ విభాగంలో..
రిజర్వ్‌ విభాగంలో 96 ఎస్సై పోస్టులను, అలాగే సివిల్‌ విభాగంలో 315 ఎస్సై పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెషల్‌ విభాగంలో 2520 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. అలాగే సివిల్‌ విభాగంలో 3580 కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెల్సిందే. మొత్తం 6511 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఒకే సారి ఇచ్చే అవ‌కాశం ఉంది. అత్యధికంగా సివిల్‌ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

You may also like...