పాఠశాల విద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తాజాగా పాఠ‌శాల విద్యాశాఖ‌లో 134 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 24 గెజిటెడ్ ప్ర‌ధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 ఉద్యోగాల‌కు అనుమ‌తి ల‌భించింది. డైట్‌లో 23 సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల పోస్టుల భ‌ర్తీ, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి, డైట్‌లో 65 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ పోస్టుల‌ను టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది.

విభాగం పోస్టుల సంఖ్య
1.డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 24
2.సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్ 23
లెక్చరర్ ఇన్ ఐఏఎస్ఈ/సీటీఈ/SCERT 22
3.డైట్ లెక్చరర్ 65
మొత్తం 134
ఎస్టీ రిజర్వేషన్ కారణంగా నోటిఫికేషన్లు ఆలస్యం కాగా.. తాజాగా వీటిని అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రోస్టర్ల వారీగా వారికి అదనంగా పోస్టులను కేటాయించనున్నారు. దీనికి సంబంధించి వివిధ శాఖల నుంచి మరో సారి వేకెన్సీ వివరాలను టీఎస్పీఎస్సీ తెప్పిస్తోంది. దీంతో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు డిసెంబర్ మొదటి వారం నుంచి వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You may also like...