రాష్ట్రంలో విద్య శాఖలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు కు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొనసాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డ్డాయి. ఆయా నోటిఫికేష‌న్ల భ‌ర్తీ ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతోంది. తాజాగా పాఠ‌శాల విద్యాశాఖ‌లో 134 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

24 గెజిటెడ్ ప్ర‌ధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 ఉద్యోగాల‌కు అనుమ‌తి ల‌భించింది. డైట్‌లో 23 సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్ల పోస్టుల భ‌ర్తీ, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి, డైట్‌లో 65 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ పోస్టుల‌ను టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది..

You may also like...