AP ఆర్టీసీ RTC లో నోటిఫికేషన్ విడుదల ,జిల్లాలో ఖాళీల వివరాలు

జిల్లాలో ఐటిఐ పాసై ఆర్టీసీలో పని చేసేందుకు విద్యార్థులు అప్రెంటిస్షిప్ కి దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా రవాణా అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అప్రెంటిటీషిప్ కి ఎటువంటి రాత పరీక్ష లేదన్నారు కేవలం మార్కులు సీనియార్టీని ప్రాతిపదికంగా జరుగుతుందన్నారు .

కర్నూలు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాలలో డీజిల్ మెకానిక్ 41 పోస్టులు, మోటార్ మెకానిక్ 4 పోస్టులు, ఎలక్ట్రిషన్ 5, వెల్డర్ 2, పెయింటర్ 1, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ 1, మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు .

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు తమకు సంబంధించిన SSC, ఐటిఐ, కుల ధ్రువీకరణ పత్రాలు, వికలాంగ ధ్రువీకరణ పత్రం ,వీటన్నిటిని తీసుకొని కర్నూలు జిల్లాలోని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని తెలిపినారు.

You may also like...