800 మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకి నోటిఫికేషన్

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 833 ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

వివిధ విభాగాల్లోని 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సెప్టెంబ‌ర్ 12వ తేదీన (సోమ‌వారం) ఒక ప్రకటనను జారీ చేసింది. ఈ ఉద్యోగాల‌కు సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది

You may also like...