ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల

అంగన్‌వాడీ టీచర్ మరియు మినీ టీచర్, ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి. విజయనగరం, కృష్ణాజిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం& అనంతపురం మరికొన్ని జిల్లాల్లో కూడా రిలీజ్ అయ్యాయి దానికి కావలసిన కింద నోటిఫికేషన్ లో ఇచ్చాను చూడండి.

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

  • తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/09/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
  • అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.
  • అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.
  • నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

Anganwadi Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 08 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 14 సెప్టెంబర్, 2022

You may also like...