పంచాయతీ శాఖలో 500 ఉద్యోగాలు, పోస్టుల ప్రకారం ఖాళీలు

పంచాయతీరాజ్ శాఖలో(Panchayat Raj Department) కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు.

పోస్టుల వివరాలు..
పోస్టు పేరు ఖాళీ సంఖ్య
జూనియర్ అసిస్టెంట్ 253
సీనియర్ అసిస్టెంట్ 173
సూపరింటెండెంట్ 103

ఇందులో జూనియర్ అసిస్టెంట్ 253, సూపరింటెండెంట్ 103, సీనియర్ అసిస్టెంట్ 173 పోస్టులు ఉన్నాయి. మొత్తం 529 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులను అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయాలను అధికారులను ఆదేశించారు.

You may also like...