AP రవాణా శాఖలో కొత్త పోస్టులు, క్లర్క్, అసిస్టెంట్,RTO 13 జిల్లాల వారికి

రవాణా శాఖకు కొత్తగా 95 పోస్టులు మంజూరు ఇప్పటికే ఉన్న పోస్టులతో పాటు అదనపు పోస్టులను మంజూరు చేయాలన్న రవాణా శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా 95 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు అదనంగా ఈ కొత్త పోస్టులు మంజూరు చేసింది. వాటిలో అధికారి స్థాయి పోస్టులు, 24 కాగా క్లారికల్ పోస్టులు 71 ఉన్నాయి.

అధికారుల స్థాయి పోస్టులకి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. వాటిలో జాయింట్ కమిషనర్ పోస్టులు 4, ఉప రవాణా కమిషనర్ పోస్టులు 2, ఆర్టీవో పోస్టులు 15, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు 3 ఉన్నాయి. ఇక మిగిలిన 71 క్లారికల్ క్యాడర్ పోస్టులను కొత్త రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీ ప్రక్రియకు రవాణా శాఖ కసరత్తు చేస్తుంది. క్లరికల్ పోస్టులు భర్తీ కోసం ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహిస్తుంది.

You may also like...