రెవిన్యూ,వ్యవసాయ,పశు సంవర్ధక,మార్కెటింగ్, ఉద్యాన, సహకార,గ్రూప్-2 & గ్రూప్-3 లో 3000 వేల ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50 వేల మార్కు దాటింది. ఈ ఏడాది ఇప్పటివరకు 49,550 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా వివిధ శాఖల్లోని మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో భర్తీకి అనుమతి లభించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 52,460కి చేరింది. తాజాగా అనుమతి లభించిన వాటిలో గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులు కూడా ఉన్నాయి.


గ్రూప్–2 కింద 663, గ్రూప్– 3 కింద 1,373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ శాఖల్లోని మరో 874 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.145, గ్రూప్–3 పోస్టుల భర్తీ నిమిత్తం జీవో నం.146ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments