AP పురపాలక సంఘం,వార్డు సచివాలయం పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్

రాయదుర్గం పురపాలక సంఘంలోని వివిధ సచివాలయ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టులకి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని 1, 2, 3, 5, 9, 10 వ సచివాలయ పరిధిలో మొత్తం తొమ్మిది వాలంటీర్లు పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు .

వయస్సు:

18 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారు సంబంధిత వెబ్సైట్లో ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఆయా సచివాలయాలు లేదా మున్సిపాలిటీలో సంప్రదించాలన్నారు.
మండలంలోని రేకులకుంట,పల్లె పల్లి గ్రామాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్లు పోస్టులకి, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2న ధరఖాస్తుల పరిశీలన, 3 తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.
ఎంపికైన వారికి 8వ తేదీన నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు.

You may also like...