గురుకుల లో భారీగా 9000 వేల ఉద్యోగాలు,టీచర్లు,TGT,PGT,లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్

సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేస్తూ నియామక బాధ్యతను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐ–ఆర్‌బీ)కు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు తదితర పూర్తి సమాచారంతో కూడిన ప్రతిపాదనల (ఇండెంట్లు)ను సంక్షేమ గురుకుల సొసైటీలు తాజాగా తయారు చేశాయి.
తాజాగా GO 317 ప్రకారం అన్ని గురుకుల సొసైటీల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తికాగా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది. ఉద్యోగ కేటాయింపుల ప్రతిపాద నలకు ఆమోదం లభించిన వెంటనే ఉద్యోగులకు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్న సొసై టీలు… వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను బోర్డుకు సమర్పించే అవకాశం ఉంది.
బీసీ గురుకులాల్లో అత్యధిక ఖాళీలు…
ప్రస్తుతం గురుకుల కొలువుల్లో అత్యధికంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,096 పోస్టులకు అనుమతులు ఇవ్వగా వాటిలో 3 వంతుకు పైబడిన ఖాళీలు మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో ఉన్నాయి.
ఆ తర్వాత స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో 2,267 ఉద్యోగాలు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 1,514 కొలువులు, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్) పరిధిలో 1,445 ఉద్యోగ ఖాళీలున్నాయి. గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ మెరిట్‌తో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ఇటీవల టెట్ ఫలితాలు సైతం వెలువడటంతో ఆయా పోస్టుల నియామకాలకు మార్గం సుగమమైంది.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments