AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2022

AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2022 దరఖాస్తుల ఆహ్వానం

కంచికచర్ల : స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని అం గనవాడీకార్యకర్తలు, సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అభ్యర్థులు దరఖాస్తుచేసు కోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. .

అభ్యర్థులు వివాహితులై స్థానికంగా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9440814591 లో సంప్రదించాలని సీడీపీఓ సూచించారు.

జగ్గయ్యపేట అర్బన్ : పట్టణంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయా పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఐదు పోస్టులకు గాను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానికు లైన వివాహిత మహిళలు, 21 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి, 10 వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 18 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

నందిగామ : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, నందిగామ ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 3 అంగన్వాడీ టీచర్లు, 13 సహాయకుల పోస్ట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 21 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ఈ నెల 16 వ తేదీ సాయంత్రంలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాల్సి ఐసీడీఎస్ ఉంటుదన్నారు .

You may also like...