AP TET NOTIFICATION 2022|AP టెట్ నోటిఫికేషన్ 2022

రేపే విడుదల..

ఏపీ టెట్‌- 2022కు సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేస్తామని పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌. సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం, నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులిటెన్‌, సిలబస్‌, పరీక్షా తేదీలు, పరీక్షా రుసుము, ఆన్‌లైన్‌ పరీక్షల సూచనలు టెట్‌ వెబ్‌సైట్‌ ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ లో శుక్రవారం ఉదయం పదిన్నర గంటల నుంచి అందుబాటులో ఉంటాయన్నారు.

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఈ నెల 16వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని, ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వాలని, ఆగస్టు ఆరో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం సెప్టెంబర్‌ 14న లేదా రెండో వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది.

You may also like...