మున్సిపల్ శాఖలో 1400 ఉద్యోగాలు

రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్‌ 1 కింద 503 పోస్టులకు, పోలీస్‌, రవాణా, అటవీ, ఎక్సైజ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది.

తాజా అనుమతులతో మొత్తం పోస్టుల సంఖ్య 35,220కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 80,039 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమించనున్నారు. మరో 11,103 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నారు. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

You may also like...