నిరుద్యోగులకు పెద్ద శుభవార్త 30,343 పోస్టులకి ఆర్ధిక శాఖ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.

రాష్ట్రంలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు ప్రకటన మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది .దీంతో నియామక సంస్థలు ఉద్యోగాల భర్తీపై సంబంధిత శాఖను సంప్రదించి శాఖల వారీగా ఆర్థికశాఖ జీవోలు విడుదల చేసింది.గ్రూప్-1,రవాణా, హోం శాఖ,వైద్య, ఆరోగ్య, జైలు శాఖ అలాగే టెట్ నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చింది.

You may also like...