అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం జిల్లా సంక్షేమాధికారి, మహిళ, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం, మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ నగర్ అర్బన్, జడ్చర్ల, దేవరకద్ర, ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా నోటిఫికేషన్ .

»నోటిఫికేషన్ తేది: 17.09.2021 | మహబూబ్ నగర్ జిల్లాలోని (4) ఐ.సి.డి.యస్ ప్రొజెక్ట్ కార్యాలయల పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు, అంగన్ వాడి ఆయాలు, మిని అంగన్వాడి టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థినుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుచున్నాయి.

»దరఖాస్తు ప్రారంభ తేది : 18,09.2021, ఆఖరి తేది: 30.09.2021 సాయంతం 5.00 గంటల వరకు, ప్రాజెక్ట్ పేరు అంగన్వాడి టీచర్ | అంగన్వాడి ఆయా మిని అంగన్వాడి మొత్తం సంఖ్య పోస్టు ఖాళీలు పోస్టు ఖాళీలు టీచర్ పోస్టులు ఖాళీలు మహబూబ్నగర్ రూరల్ 

»ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు పరచడానికి గానీ, మార్పులు చేయడానికి జిల్లా కలెక్టర్ / చైర్మన్, మహబూబ్ నగర్ గారికి పూర్తి అధికారం కలదు. సం / – జిల్లా సంక్షేమాధికారి, మహిళ, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సం / – జిల్లా కలెక్టర్ / చైర్మన్ సంక్షేమ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా 

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5.  అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు ఆ జిల్లా కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు.

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

 II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

    III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).

4. నివాసస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

గౌరవ వేతనం

»అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును.

»ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం : రూ .11500 / నెలకు.

»మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/ – నెలకు.

»అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం: రూ.7000 / – నెలకు..

ఈనెల 18.09.2021, ఆఖరి తేది: 30.09.2021 తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

You may also like...