గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ లో వెయ్యి కొత్త ఉద్యోగాలు అన్ని జిల్లాల వారికి

బీసీ గురుకుల సొసైటీ లో వెయ్యి ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటైన 119 జూనియర్ కాలేజీలో బోధన బోధనేతర కొలువులు తాత్కాలిక పద్ధతిలో నియామకానికి ఏర్పాట్లు.పూర్తి స్థాయి వరకు కొనసాగే అవకాశం. మహాత్మ జ్యోతి పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సొసైటీ పరిధిలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలు ప్రభుత్వం మంజూరు చేసింది. సొసైటీ పరిధిలో 119 bc గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీలు గా ప్రభుత్వ అప్ గ్రేడ్ చేసిన క్రమంలో వీటిని 2021 22 విద్యా సంవత్సరంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టిన సొసైటీ తాజాగా బోధన బోధనేతర సిబ్బందిని నియమించేందుకు కసరత్తు చేస్తుంది. బోధన, బోధనేతర 119 కాలేజీల్లో దాదాపు 1000 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది .ప్రస్తుతం ఈ ఉద్యోగాలు తాత్కాలిక పద్ధతులు నియమించుకోవాలని సొసైటీ భావిస్తోంది .బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో 850 టీచింగ్ పోస్టులు 150 వరకు నాన్ టీచింగ్ పోస్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పద్ధతిలో కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ ఎంప్లాయిస్ గా నియమించుకోవాలని సొసైటీ అధికారులు ఉన్నారు.

You may also like...