మహిళ శిశు సంక్షేమ శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల 2021
జిల్లాలోని (9) ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయముల పరిధిలో ఖాళీగా ఉన్న (28) అంగన్ వాడి టీచర్, (7) మినీ అంగన్ వాడి టీచర్ & (79) సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత, ఖాళీలు మరియు ఇతర వివరముల కొరకు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు. మరియు పూర్తి వివరముల కొరకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయములో సంప్రదించగలరు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
2. తేదీ: 30.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.
3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.
5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.
6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 30.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.
8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.
9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.
ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు
I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .
II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .
జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).
4. నివాసస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
ఆన్ లైన్ లో దరఖాస్తుతో పాటు కావలసిన ధృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారితో ధృవీకరించి తేది: 01.08.2021 తేది: 18.08.2021 సా. 5.00గం||ల లోపు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ ద్వారా సమర్పించవలెను.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు తేది: 20.08.2021 నుండి తేది: 30.08.2021 వరకు సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయాలలో జరిగే ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి. లేనిచో వారి దరఖాస్తులు పరిగణనలోకి తీసుకొనబడవు. ఇట్టి నోటిఫికేషన్ రద్దు పరుచుటకు గాని, మార్పులు చేయుటకు గాని శ్రీయుత జిల్లా కలెక్టర్/ చైర్మన్, నల్గొండ గారికి పూర్తి అధికారం ఉంది.
పూర్తి వివరములకు సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయములను సంప్రదించగలరు. సం/- జిల్లా సంక్షేమాధికారి/ కన్వీనర్ మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, నల్గొండ జిల్లా.
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
Recent Comments