AP GROUP 2 NOTIFICATION 2021 POSTS 1080
గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది, ఆ పైన సమయం పడుతోందని, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం. వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తాం.
వచ్చే ఆగస్టులో చెప్పుకోదగ్గ రీతిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తాం. అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం.
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
Recent Comments