ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో భారీగా ఉద్యోగాలు.పోస్టులు 7,000

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో మరో ఏడు వేల పోస్టుల భర్తీ భారీగా నియామకాలకు కసరత్తు. గత ఏడాదిలో 2920 పోస్టుల భర్తీ. ఆరోగ్య మిషన్ ద్వారా అనుమతి రాగానే నోటిఫికేషన్ ద్వారా మిగితా నియామకాలు పూర్తి.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు బలోపేతం చేయడానికి మరో ఏడు వేల పోస్టుల భర్తీకి వైద్యఆరోగ్యశాఖ సిద్ధమైంది రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో mid level health providers నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే 2920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ANM,ఒక ఆశా కార్యకర్తలు ఉంటారు .దీనివల్ల గ్రామీణ ప్రాంతం లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఆరోగ్యశాఖ 9500 పైగా శాశ్వత నియామకాలు చేపట్టింది.

You may also like...