Group-2 Notification 2021 Posts 4,000

రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కానున్నాయి .జోన్ల విధానం పైన స్ఫష్టత రావడంతో ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. గ్రూప్-1 కింద పెండింగ్ లో ఉన్న పోస్టులతో పాటు, ఆయా స్థాయిలో తొలుతగా దాదాపు నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం .
టిఎస్పిఎస్సి నుంచి ఈ పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ కానున్నట్లు తెలుస్తోంది .రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ఖరారు కావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇప్పటివరకు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే అత్యవసరంగా నాలుగు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.గ్రూప్-1,2,3 పోస్టులకి కూడా లైన్ క్లియర్ అయింది.. ముందుగా ఈ 4000 వేల పోస్టులకి నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది..

You may also like...