ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య మోడల్ స్కూల లో 3,479 పోస్టులు Job Notification

ఏకలవ్య స్కూల్ లలో ఖాళీల భర్తీకి శ్రీకారం.దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల కోసం 17 రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 3479 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం .ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపాల్ పి జి టి టీజీటీ సంబంధించిన నాలుగు విభాగాల్లో సిబ్బందిని ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే TGT లకు మినహా మిగతా సిబ్బందికి ఇంటర్వ్యూలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. ఖాళీల ఆధారంగా నియామకాలు రాష్ట్రాలవారీగా జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో 14 ప్రిన్సిపల్ పోస్టులు, 6 వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు ,TGT 97 తో కలిపి మొత్తం 117 ఉన్నవి. దరఖాస్తులు స్వీకరించడానికి వెబ్సైట్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య అందుబాటులో ఉంచుతారు. ప్రవేశ పరీక్షను జూన్ మొదటివారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నవి .ఆంధ్రప్రదేశ్ లో 117 పోస్టులు తెలంగాణ లో 262 ఖాళీలు ఉన్నవి.

You may also like...