ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం జిల్లాలోని పాఠశాలలు కళాశాలలో గెస్ట్ టీచర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతూ ఒక ఉద్యోగ ప్రకటన వెలువడటం జరిగింది. విద్యాసంస్థలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ ,ఫిజికల్ సైన్స్, సబ్జెక్ట్ కామర్స్ సబ్జెక్టులను ఆంగ్లమాధ్యమంలో బోధించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టుతో B.Ed, పి జి ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లు జిరాక్స్ ఒక సెట్ జతపరచి ఈ నెల 17న సాయంత్రం 5 గంటల లోపు కర్నూల్ జూనియర్ కళాశాలలో సమర్పించవలెను.
అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీన డెమో ద్వారా గెస్ట్ ఫ్యాకల్టీ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ చివరి తేదీ:17/02/2021

ఇంటర్వ్యూ/డెమో:22/02/2021

You may also like...